క్యాన్సర్తో పోరాడుతోన్న తొమ్మిదేళ్ల చిన్నారి చికిత్స కోసం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆపన్న హస్తాన్ని అందించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన గొట్టె అక్షయ క్యాన్సర్తో బాధపడుతోంది. నిరుపేద కుటుంబానికి చెందిన అక్షయ పరిస్థితిని గుర్తించిన మంత్రి... చికిత్స కోసం హైదరాబాద్లోని బసవతారకం ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు.
చిన్నారి చికిత్స కోసం మంత్రి ఆర్థికసాయం - పెద్దపల్లి జిల్లా తాజా వార్తలు
క్యాన్సర్తో పోరాడుతోన్న ఓ చిన్నారి చికిత్స కోసం ఆర్థిక సాయం చేసి మంత్రి కొప్పుల ఈశ్వర్ మానవత్వం చాటుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన అక్షయకు పరిస్థితిని చూసిన మంత్రి... మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.
చిన్నారి చికిత్స కోసం మంత్రి ఆర్థిక సాయం
మెరుగైన వైద్యానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేశారు. రూ.4 లక్షల చెక్కును అక్షయ తండ్రి లక్ష్మీ నారాయణకు అందించారు.
ఇదీ చదవండి:కాంగ్రెస్ గురించి ప్రణబ్ ఆత్మకథలో ఏముంది?