పెద్దపల్లి జిల్లా మంథనిలో తెరాస పార్టీ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో తొమ్మిది మండలాలకు చెందిన 56 మంది లబ్ధిదారులకు 25 లక్షల విలువ గల చెక్కులను పేదలకు అందించారు.
'ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం సీఎం సహాయనిధి' - పెద్దపల్లి జిల్లా తాజా సమాచారం
పెద్దపల్లి జిల్లా మంథనిలో పేదలకు సీఎం సహాయనిధి చెక్కులను జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు పంపిణీ చేశారు. ఆపదలో ఉన్నవారికి వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు.

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు
వైద్య ఖర్చుల కోసం పేద ప్రజలు అప్పులపాలు కాకుండా సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని ఆయన తెలిపారు. మంథని నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారని పుట్ట మధు వెల్లడించారు.