పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయీ బ్రాహ్మణులకు పీపీఈ కిట్లను అందించారు. లాక్‌డౌన్ సడలింపులో భాగంగా రేపటినుంచి సెలూన్లు తెరుచుకోవడంతో వీటిని అందించినట్లు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపాడు. కిట్లను పంపిణీ చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కరోన వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, స్వీయ రక్షణ పాటిస్తూ ప్రతి ఒక్కరూ ముందుకు సాగిపోవాలని ఎమ్మెల్యే సూచించారు. పీపీఈ కిట్లలోని డ్రెస్సులు ధరించిన నాయీ బ్రాహ్మణులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
నాయీ బ్రాహ్మణులకు పీపీఈ కిట్లు పంపిణీ - పీపీఈ కిట్లు పంపిణీ
మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నాయీ బ్రాహ్మణులకు పీపీఈ కిట్లను అందించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.
నాయీ బ్రాహ్మణులకు పీపీఈ కిట్లు పంపిణీ