ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీని సీఎం కేసీఆర్ కలవడంలో ఉన్న రహస్య ఒప్పందం ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తెరాస, భాజపా ఒక్క గూటి పక్షులేనని... పైకి మాత్రం విమర్శలు చేసుకుంటూ ప్రజలను పక్కదోవపట్టిస్తుంటారని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసమే తెరాస, భాజపా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయన్నారు.
'తెరాస, భాజపా రెండూ ఒక గూటి పక్షులే..' - కేసీఆర్, నరేంద్రమోదీపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు విమర్శలు
తెరాస, భాజపా ఒక్క గూటి పక్షులేనని.. పైకి మాత్రం విమర్శలు చేసుకుంటూ ప్రజలను పక్కదోవపట్టిస్తుంటారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. తెరాస రెండేళ్ల పాలన వైఫల్యాలపై శ్రీధర్‌బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
'తెరాస, భాజపా రెండూ ఒక గూటి పక్షులే..'
రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న 33 అంశాలకి సంబంధించిన ఒప్పందాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని అర్హతలతో కూడిన అభ్యర్థిని పీసీసీ అధ్యక్షునికి నియమిస్తారని శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:'భూములిచ్చేందుకు మేము సిద్ధం... తగిన పరిహారం ఇప్పించండి'
Last Updated : Dec 13, 2020, 4:57 PM IST