దేశంలో రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తామని, కొత్తగా ఐదు యూరియా ఫ్యాక్టరీలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తోన్న ఆర్ఎఫ్సీఎల్ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు.
పనుల పరిశీలన
సాగు పెరగటం వల్ల యూరియా సరిపోవటం లేదని.. ఇతర దేశాల నుంచి 2.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంటున్నట్లు మాండవీయ అన్నారు. నవంబర్ నాటికి ఆర్ఎఫ్సీఎల్లో యారియా ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు తీరుతాయన్నారు. 99 శాతం పనులు పూర్తయ్యాయని.. ట్రయిల్ రన్‌కు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. కరోనా కారణంగా కొంత పనులు ఆలస్యం అయిందని పేర్కొన్నారు. స్థానికులకు ఉద్యోగ కల్పనపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం పనులను పరిశీలించారు.