పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఉదయం 9.45 నిమిషాల వరకే అన్ని రకాల వ్యాపార కార్యక్రమాలు ముగించాలని పోలీసులు తెలిపారు. వర్తకులు, కొనుగోలుదారులు, అమ్మకందారులు కచ్చితంగా ఈ నిబంధన పాటించాలని సామాజిక మాధ్యమాల వేదికగా చైతన్య పరుస్తున్నారు. శనివారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ దుకాణాలు మూసేయాలని ఆదేశించారు. లాక్డౌన్ పట్ల మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ అవగాహన కల్పిస్తున్నారు.
మంథనిలో పటిష్ఠంగా లాక్డౌన్ అమలు - తెలంగాణ వార్తలు
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచే పోలీసులు దుకాణదారులు, కొనుగోలుదారులను అప్రమత్తం చేశారు. ఉదయం పది దాటిన తర్వాత తనిఖీలు ముమ్మరం చేశారు.
మంథనిలో పటిష్ఠంగా లాక్డౌన్, మంథని లాక్డౌన్
ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనాల ధ్రువ పత్రాలను పరిశీలిస్తూ అనుమతులు ఇస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చలానాలు విధిస్తూ... సీజ్ చేస్తున్నారు. రెండు నిమిషాలు ఆలస్యమైతే తమను ఇబ్బందులకు గురి చేయవద్దని పోలీసులను కొందరు వేడుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని పోలీసులు వారికి తెలియజేశారు.