తెలంగాణ

telangana

ETV Bharat / state

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: కోరుకంటి చందర్​

మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ అన్నారు. షాదీ ముబారక్​, ఉర్దూ మీడియం పాఠశాలలు, హాస్టళ్లను ఏర్పాటు చేసి పేద ముస్లింలకు అండగా ఉంటోందని చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

korukanti chander meeting with muslims in camp office ramagundam peddapally district
మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: కోరుకంటి చందర్​

By

Published : Oct 7, 2020, 6:25 PM IST

రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లింల సంక్షేమానికి సీఎం కేసీఆర్.. షాదీ ముబారక్, ఉర్దూ మీడియం పాఠశాలలు, హాస్టళ్లను ఏర్పాటు చేసి పేద ముస్లింలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

రామగుండం కార్పొరేషన్ పరిధిలో 5వ ఇంక్లయిన్ ఏరియాలో మైనారిటీల కోసం షాదిఖానాను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, అదే విధంగా మసీద్ మరమతులు చేపడతామని ఎమ్మెల్యే వెల్లడించారు. మహిళల కోసం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ద్వారా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.

ముస్లింల షాదిఖానాకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేని మత పెద్దలు సన్మానించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details