లాక్డౌన్ పరిస్థితుల్లోనూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటూ కల్యాణలక్ష్మి చెక్కులను అందించడం ఆనందంగా ఉందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
విపత్కర పరిస్థితుల్లోనూ పేదలకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే కోరుకంటి - కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పంపిణీ చేశారు. లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితిలోనూ.. పేదలకు ప్రభుత్వం అండగా నిలబడుతోందని తెలిపారు.
విపత్కర పరిస్థితుల్లోనూ పేదలకు ప్రభుత్వం అండ
నియోజకవర్గ పరిధిలోని రామగుండం, పాలకుర్తి మండలాలకు చెందిన 64 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. రామగుండం నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు వెయ్యికి పైగా కళ్యాణలక్ష్మి చెక్కులను అందించామన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ... పేదలకు అండగా నిలిచి తెల్లరేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాలకు నెలకు రూ. 1,500తో పాటు మనిషికి 12 కిలోల బియ్యాన్ని అందించిన సీఎం కేసీఆర్కు అందరూ రుణపడి ఉంటారన్నారు.