ఖానాపూర్ శివారులో కలప స్మగ్లర్ అరెస్ట్ - manthani
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ గ్రామ శివారులో బొక్కల వాగు తీరంలో కలప స్మగ్లర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కలపను స్వాధీనం చేసుకున్నారు.
కలపను స్వాధీనం చేసుకున్న పోలీసులు
కలప స్మగ్లర్ ఎడ్ల శీనును పెద్దపల్లి జిల్లా మంథని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 19న నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. కలప డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని... వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ మధ్యలోని బొక్కల వాగులో నాలుగు టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.