తెలంగాణ

telangana

ETV Bharat / state

'నువ్వు కూ.. అంటే కొక్కోరొకో అని రాసినం' - కేసీఆర్​పై మండిపడ్డ జర్నలిస్టులు

ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటే ఉంటూ... ఆయన కూ.. అంటే కొక్కోరొకో అని రాశామని గుర్తు చేసుకున్నారు పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు. తమ సమస్యల పరిష్కారం కోసం పెద్దపల్లి జిల్లా మంథనిలో వారు ఆందోళన నిర్వహించారు.

జర్నలిస్టులు

By

Published : Sep 26, 2019, 11:23 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని తహసీల్దార్​ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు ఆందోళన నిర్వహించారు. పాత్రికేయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారించాలని ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన నిర్వహించారు. ఆరు సంవత్సరాలుగా.. జర్నలిస్టులకు సంబంధించిన సంక్షేమ పథకాలు కార్యరూపం దాల్చకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.

జర్నలిస్టుల ఆందోళన..

ABOUT THE AUTHOR

...view details