హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసు ఘటనా స్థలాన్ని తెల్లవారు జామున 2.30 గంటలకు నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి పరిశీలించారు. హత్యపై ప్రతిపక్షాలు, అడ్వొకేట్లు ప్రభుత్వ తీరుపై మండిపడుతుండడం వల్ల ఉన్నతాధికారులు జోక్యం చేసుకోక తప్పలేదు. హుటాహుటిన నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి కల్వచర్లకు చేరుకుని సీన్ ఆఫ్ అఫెన్స్‌ను పరిశీలించారు. హత్య జరిగిన తీరుపై రామగుండం సీపీని అడిగి తెలుసుకున్నారు.
కల్వచర్ల వద్ద హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణిల హత్య సమాచారం అందుకున్న వెంటనే అన్ని రకాల చర్యలు తీసుకున్నామని రామగుండం సీపీ సత్యనారాయణ వివరించారు. దాడిలో గాయపడ్డ న్యాయవాదులను పెద్దపల్లికి తరలిస్తుండగానే రామగిరి ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో క్రైమ్ స్పాట్ డిస్టర్బ్ కాకుండా బందోబస్త్ చేయించారన్నారు.