పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాములు, రవీందర్ అనే సింగరేణి కార్మికులు మిలీనియం క్వార్టర్స్‌లో ఒకే బ్లాక్‌లో నివాసముంటున్నారు. తన భార్య రవీందర్‌తో ఫోన్లో మాట్లాడుతుందని అనుమానించిన రాములు... నిన్న అర్ధరాత్రి అతనిపై కత్తితో దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే రవీందర్‌ని కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రవీందర్‌ను సింగరేణి ఆస్పత్రికి తరలించారు.
ప్రాణాలు తీసిన అనుమానం - husband sucide at peddapalli
భార్యపై అనుమానం భర్త ప్రాణాలను తీసింది. పరువు పోతుందని భావించిన అతను ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు.
ప్రాణాలు తీసిన అనుమానం
అనంతరం కాలనీవాసుల ముందు పరువు పోతుందని భావించిన రాములు... ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి రాములు విగతజీవిగా మారాడు.
ఇవీ చూడండి: టీచర్.. మమ్మల్ని విడిచి వెళ్లొద్దు.. ప్లీజ్