పెద్దపల్లి జిల్లా మంథని అయ్యప్ప స్వామి దేవాలయంలో కొమురవెల్లి వనజ-ధనంజయ్, సునీత-విజయ్ కుమార్ దంపతులు గత నాలుగు రోజులుగా శృంగేరి పీఠానికి చెందిన అర్చకులతో సహస్ర మాహా చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు. గోపూజ, చండీ పారాయణం, చతుర్వేదహవనం, లక్ష రుద్రాక్షలతో అభిషేకం, సహస్ర లింగార్చన, సామూహిక కుంకుమ పూజలు, మహా మంగళహారతి కార్యక్రమాలు చేపట్టారు. గురువారం మహా పూర్ణాహుతితో యాగం ముగిసింది.
లోక కళ్యాణార్థం సహస్ర చండీయాగం - మంథని
పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఓ దంపతులు సహస్ర చండీ యాగాన్ని నిర్వహించారు. గోపూజ, చండీ పారాయణం, చతుర్వేద హవనం వంటి కార్యక్రమాలతో నిష్ఠగా పూజలు చేశారు.
లోక కళ్యాణార్థం సహస్ర చండీయాగం
లోకకల్యాణం మంథని ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండాలని.. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అపమృత్యు భయం పోవాలని ఈ యాగం చేశామని నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చూడండి:జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా