తెలంగాణ

telangana

ETV Bharat / state

పత్తికి మద్దతు ధర కల్పించండి: రైతుల ఆందోళన - రైతుల ఆందోళన

పత్తికి మద్దతు ధర కల్పించాలంటూ పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్​లో రైతులు ఆందోళన చేపట్టారు. క్వింటాకు కనీసం రూ.6500 ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

పత్తికి మద్దతు ధర కల్పించండి

By

Published : Mar 29, 2019, 7:36 PM IST

పత్తికి మద్దతు ధర కల్పించండి
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్​ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. పత్తికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్​ చేశారు. వ్యాపారులు కేవలం రూ.5200 మాత్రమే చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్లక్ష్యపు మత్తులో అధికారులు..!

మార్కెట్లో అధికారుల తీరుపై రైతులు భగ్గుమన్నారు. వారి పర్యవేక్షణ కరవైందని మండిపడ్డారు.

ఉదయం నుంచి నిరీక్షిస్తున్నా.. అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోయేసరికి రహదారిపై రైతన్నలు ఆందోళనకు దిగారు. క్వింటాకు కనీసం రూ.6500 ఇవ్వాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. ఒక్క అధికారి కూడా లేకపోవడం విశేషం.

ఇవీ చూడండి:కేంద్రం, ఈసీకి 'కోర్టు ధిక్కరణ' నోటీసులు

ABOUT THE AUTHOR

...view details