తెలంగాణ

telangana

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు - నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

లాక్​డౌన్​ కారణంగా దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధించారు. దీనిని అక్రమార్కులు కొందరు అదనుగా తీసుకొని నాటుసారా తయారు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్​ అధికారులు దాడులు చేసి, స్థావరాలను ధ్వంసం చేశారు.

excise police attacks on natusaara in vakeelupalli
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

By

Published : Apr 16, 2020, 8:01 PM IST

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వకీలుపల్లి గ్రామ శివారులో నాటుసారా స్థావరాలను ఎక్సైజ్​ సీఐ గురువయ్య ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో అనుమానిత ప్రదేశాల్లో తనిఖీ చేశారు.

నాటుసారా తయారు చేస్తున్న సమయంలో నిందితులను పట్టుకొని, వంద లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దుబ్బలపల్లి, చిల్లపల్లి గ్రామస్థులుగా గుర్తించారు. మంథని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్​ ముందు బైండోవర్​ చేశారు.

ఇదీ చూడండి:కర్తవ్యం మరిచిన 'కథానాయకుడు'

ABOUT THE AUTHOR

...view details