పేకాటరాయుళ్లతోపాటు మాజీ మంత్రి అరెస్ట్ - pedda[alli
రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో పేకాట క్లబ్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మాజీ మంత్రి మాతంగి నర్సయ్యను అరెస్టు చేశారు.
మాజీమంత్రి అరెస్ట్
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ మంత్రి మాతంగి నర్సయ్య ఇంట్లో నిన్న రాత్రి పోలీసులు తనిఖీలు చేశారు. ఇంట్లో పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాటరాయుళ్లను రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 27 వేల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి నర్సయ్యను కూడా అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు.