తెలంగాణ

telangana

ETV Bharat / state

చినుకు పడితే చిత్తడి చిత్తడే... ఆ రోడ్డుపై ప్రయాణిస్తే ప్రమాదమే!

చిన్న వర్షం పడిందంటే చాలు... పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు వెళ్లే రహదారంతా చిత్తడి చిత్తడిగా మారిపోతుంది. రోడ్లపై నీళ్లు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. గుంతలు కన్పించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

ellampally project roads damage
ellampally project roads damage

By

Published : Aug 19, 2020, 10:51 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంప్​హౌస్​లు అనుసంధానిస్తూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పెద్దపెల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా మారనుంది. అయితే పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేదు. 2014లో ప్రాజెక్టు పూర్తయినా నేటికీ రోడ్డు లేకపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏడున్నర కోట్లతో చేపట్టిన తారు రోడ్డు పనులు రెండేళ్లుగా కొలిక్కి రావడం లేదు.

పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు వెళ్లే రహదారి పరిస్థితి అధ్వానంగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు మట్టి గుంతల్లో నీరు నిండి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కరకట్ట నుంచి ఆనకట్ట వరకు మట్టి రోడ్డుపై వర్షపు నీరు నిలుస్తోంది. మరోవైపున మంచిర్యాల జిల్లా గుడిపేట వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రాజెక్టు రహదారి నిర్మాణం పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.

చినుకు పడితే చిత్తడి చిత్తడే... ఆ రోడ్డుపై ప్రయాణిస్తే ప్రమాదమే!
చినుకు పడితే చిత్తడి చిత్తడే... ఆ రోడ్డుపై ప్రయాణిస్తే ప్రమాదమే!
చినుకు పడితే చిత్తడి చిత్తడే... ఆ రోడ్డుపై ప్రయాణిస్తే ప్రమాదమే!
చినుకు పడితే చిత్తడి చిత్తడే... ఆ రోడ్డుపై ప్రయాణిస్తే ప్రమాదమే!
చినుకు పడితే చిత్తడి చిత్తడే... ఆ రోడ్డుపై ప్రయాణిస్తే ప్రమాదమే!

ఇదీ చూడండి :లంచం కేసులో అధికారుల కస్టడీకి అనిశా పిటిషన్

ABOUT THE AUTHOR

...view details