తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు కుటుంబాల మధ్య "కుక్క" పంచాయితీ - godava

ఓ పెంపుడు కుక్క చేసిన తప్పిదం వల్ల రెండు కుటుంబాల మధ్య చిచ్చు రగిలింది. పరస్పర దాడులకు దిగి ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఒకరిపై ఒకరు పరస్పర దాడి

By

Published : Apr 22, 2019, 4:24 PM IST

Updated : Apr 22, 2019, 5:08 PM IST

పెద్దపల్లి జిల్లా విద్యానగర్​లో సందీప్‌ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్‌ వద్ద రోజూ బహిర్భూమికి వెళ్లడం యజమానికి చిరాకు కలిగించింది. కుక్కను టిఫిన్‌ సెంటర్‌వైపు రాకుండా చూడాలని హెచ్చరించారు. దీంతో గొడవ మొదలై పరస్పరం దూషణలకు దిగారు. ఈ సందర్భంగా పెంపుడు కుక్క యజమాని సందీప్‌ మహిళలపై దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన పెద్దపల్లి పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.

ఒకరిపై ఒకరు పరస్పర దాడి
Last Updated : Apr 22, 2019, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details