పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీమహాగణాధిపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి చందనంతో విలేపనం చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
గణపతి ఆలయంలో భక్తుల ప్రదక్షిణలు - peddapalli district latest news today
మంథని పట్టణంలోని శ్రీమహాగణాధిపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి 108 ప్రదక్షిణలు చేశారు.
గణపతి ఆలయంలో భక్తుల ప్రదక్షిణలు
చంద్రోదయ సమయాన భక్తులు విచ్చేసి స్వయంగా పంచామృతాలు, పండ్లరసాలు స్వామివారికి సమర్పించారు. చందనం, గరక మాలలు, పుష్పాలతో అలంకరించారు. ఉండ్రాళ్లు, పండ్లను నైవేద్యంగా నివేదించారు. విశేష మంగళ హారతులు స్వామివారికి సమర్పించారు. అర్చక స్వాములు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. సంకష్టహర చతుర్ధి సందర్భంగా భక్తులు 108 ప్రదక్షిణలు చేశారు.
ఇదీ చూడండి :తందూరి చాయ్... రుచితో పాటు ఆరోగ్యం