తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్దపల్లిని కమ్మేసిన కారు మబ్బులు - పెద్దపల్లి

తెల్లవారుజాము నుంచి పెద్దపల్లిని కారుమబ్బులు కమ్మేసి కుండపోత వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రంలోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కమ్మేసిన కారు మబ్బులు

By

Published : Aug 7, 2019, 1:06 PM IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నల్లటి కారు మబ్బులు కమ్ముకొని తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రంలో రహదారులన్నీ జలమయమయ్యాయి. మురికి కాల్వల్లో భారీగా వరదనీరు చేరడం వల్ల వ్యర్థజలం, వర్షపు నీరు పొంగిపొర్లుతోంది. కమాన్ నుంచి పోలీస్​స్టేషన్ వెళ్లే రహదారితో పాటు కలెక్టరేట్ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ద్విచక్ర వాహన దారులు, బాటసారులు వరద నీటితో ఇబ్బందులు పడ్డారు.

కమ్మేసిన కారు మబ్బులు

ABOUT THE AUTHOR

...view details