పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వ్యవసాయ శాఖకు సంబంధించిన పాత భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. ఆ భవనానికి సంబంధించిన ప్రభుత్వ సామాగ్రిని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అక్రమంగా తన సొంత విద్యాసంస్థలకు తరలిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
'ప్రభుత్వ సామాగ్రిని ఎమ్మెల్యే వాడేసుకుంటున్నారు' - ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
ప్రభుత్వానికి చెందిన పాత భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్న సమయంలో... భవనానికి సంబంధించిన సామాగ్రిని పెద్దపల్లి ఎమ్మెల్యే అక్రమంగా తరలిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. వ్యవసాయ శాఖ అధికారులు దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
'ప్రభుత్వ సామాగ్రిని ఎమ్మెల్యే వాడేసుకుంటున్నారు'
భవనం వద్దకు వెళ్లి సామాగ్రిని పరిశీలించారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టాలని... అక్రమంగా తరలించుకుపోయిన వాటిపై దర్యాప్తు చేసి... తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:ఉపాధ్యాయుడి నిర్వాకం.. గదిలో పెట్టి తాళం వేసిన గ్రామస్థులు