పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలంలోని మచ్చుపేటలోని బగుళ్లగుట్ట అడవి ప్రాంతంలో సోమవారం ఆవుపై పెద్దపులి దాడి చేసింది. మంగళవారం అటవీశాఖ అధికారులు ఆవు కళేబరాన్ని పరిశీలించారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, మంథని సీఐ మహేందర్ పులి సంచరించిన ప్రాంతాన్ని సందర్శించారు.
పులి కోసం సీసీ కెమెరాల ఏర్పాటు
గతవారం రోజుల క్రితం పెద్దపల్లి జిల్లాలోకి పులి ప్రవేశించినట్లు అధికారులు తెలపటంతో మంథని నియోజకవర్గంలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మచ్చుపేట గ్రామ సమీపంలో ఉన్న బగుళగుట్టలో పెద్ద పులులు సంచరిస్తున్నాయనే సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పులి యొక్క కదలికలపై నిఘా ఉంచారు.
పులి కోసం సీసీ కెమెరాల ఏర్పాటు
మచ్చుపేట గ్రామ సమీపంలో ఉన్న బగుళగుట్టలో పెద్ద పులులు సంచరిస్తున్నాయనే సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి కదలికలపై నిఘా ఉంచారు. పులిపై ఎవరైనా దాడి చేస్తే శిక్షార్హులు అని బోర్డు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి :'కేసీఆర్ అసెంబ్లీని ఫామ్ హౌస్లో పెట్టుకుంటే బాగుంటుంది'