కార్మిక ఉద్యమనేత, అమరజీవి మాదిరెడ్డి భాస్కర్రావు ఆశయాలను కొనసాగించాలని ఏఐటీయూసీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వై. గట్టయ్య, సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ ఎం.నారాయణ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని భాస్కర్రావు భవన్లో జరిగిన మాదిరెడ్డి భాస్కర్ రావు 29వ వర్ధంతి సభలో పలువురు పాల్గొని మాట్లాడారు. భాస్కర్రావు కార్మికుల సమస్యలను, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అనేక రకాలుగా కృషి చేసిన మహానీయుడని కొనియాడారు.
'భాస్కరరావు మృతి కార్మిక లోకానికి తీరని లోటు' - singareni
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని భాస్కర్రావు భవన్లో మాదిరెడ్డి భాస్కర్రావు 29వ వర్థంతి సభను ఏర్పాటు చేశారు. కార్మిక ఉద్యమ నేత భాస్కర్రావు ఆశయాలను కొనసాగించాలని ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు పేర్కొన్నారు.
సీపీఐ , ఏఐటీయూసీల బలోపేతం కోసం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. కొంతమంది స్వార్థపరుల ఉనికి కోసం భాస్కర్ రావును హత్య చేయడం బాధాకరమన్నారు. ఆయన కార్మికులు, ప్రజల మనసులో చిరకాలం నిలిచిపోతారన్నారు. అనంతరం గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయం సమీపంలోని భాస్కర్రావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేల్పుల నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ, ప్రజాసంఘాల నాయకులు మేరుగు రాజయ్య, వైవీ రావు, రంగు శ్రీనివాస్, గోపిక మోహన్, కె.కనకరాజ్, భాస్కర రావు కుమారులు శేషు కుమార్, నాగరాజ్, శ్రీధర్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: బిరాబిరా గోదావరి: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత