తెలంగాణ

telangana

ETV Bharat / state

'రామ మందిర నిర్మాణంలో హిందువులంతా భాగం కావాలి' - రామ మందిర నిర్మాణం కోసం మంథనిలో చందాల సేకరణ

రామ మందిర నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ పాలు పంచుకోవాలని పెద్దపల్లి జిల్లా భాజపా ఇంఛార్జీ రేండ్ల సంపత్ కుమారు అన్నారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలు, ఆర్​ఎస్​ఎస్​ విశ్వహిందు పరిషత్ నాయకులతో కలిసి మంథని నియోజకవర్గ కేంద్ర వీధుల్లో చందాలు వసూలు చేశారు.

bjp peddapalli district incharge says all hindus should take part in construction of rama mandir
'రామ మందిర నిర్మాణంలో హిందువులంతా భాగం కావాలి'

By

Published : Feb 8, 2021, 2:00 PM IST

అయోద్య రామ మందిర నిర్మాణంలో ప్రతీ హిందువు భాగస్వామి కావాలని పెద్దపల్లి జిల్లా భాజపా ఇంఛార్జీ రేండ్ల సంపత్ కుమారు అన్నారు. జిల్లాలోని మంథని నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కార్యకర్తలు, ఆర్​ఎస్​ఎస్,​ విశ్వహిందు పరిషత్ నాయకులతో కలిసి అయోధ్య మందిర నిర్మాణం కోసం వీధుల్లో పలువురి వద్ద నుంచి చందాలు వసూలు చేశారు.

రామమందిర నిర్మాణం కోసం జనవరి 20 నుంచి ఈ నెల 10 వరకు నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సంపత్ కుమార్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామజన్మభూమి నిధి సేకరణ కమిటీ నాయకులు కనుకుంట్ల స్వామి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'పూర్తి ఆరోగ్యంతో ఉన్నా.. పదేళ్లు నేనే సీఎం'

ABOUT THE AUTHOR

...view details