తెలంగాణ

telangana

ETV Bharat / state

మంథని నియోజకవర్గంలో భాజపా నేతల ముందస్తు అరెస్టు

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని భాజపా నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా పోలీస్​స్టేషన్​కు తరలించారు.

BJP leaders arrested in Manthani constituency
మంథని నియోజకవర్గంలో భాజపా నేతల ముందస్తు అరెస్టు

By

Published : Sep 11, 2020, 11:28 AM IST

రాష్ట్ర భాజపా పిలుపు మేరకు ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కమాన్​పూర్, రామగిరి, మంథని మండలాల్లోని భాజపా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు.

తెలంగాణ రాక ముందు సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరుపుకుంటామని చెప్పిన సీఎం కేసిఆర్.. రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించారని నేతలు మండిపడ్డారు. 2023లో భాజపా అధికారంలోకి రాగానే.. రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు.

మంథని నియోజకవర్గంలో భాజపా నేతల ముందస్తు అరెస్టు

ఇదీ చూడండి:-'ఆ సమస్యకు పరిష్కారం సీబీఎస్​ఈ చేతిలో లేదు'

ABOUT THE AUTHOR

...view details