తెలంగాణ

telangana

ETV Bharat / state

కులవృత్తులను ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం: తలసాని - పెద్దపల్లి జిల్లా వార్తలు

కులవృత్తులను అర్థికంగా ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లిలో ఏర్పాటు చేసిన గొర్రెల, మేకల మార్కెట్ యార్డును మంత్రి ప్రారంభించారు.

కులవృత్తులను ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం: తలసాని
కులవృత్తులను ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం: తలసాని

By

Published : Sep 20, 2020, 5:07 PM IST

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి వద్ద నాలుగున్నర ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన గొర్రెల, మేకల మార్కెట్ యార్డును పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గొర్రెలకు వ్యాక్సిన్ వేశారు. కులవృత్తులను అర్థికంగా ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమలకు ఆర్థికంగా చేయూత అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పథకాలను తీసుకొచ్చారని అన్నారు.

ఇదే క్రమంలో ఇప్పటి వరకు 50 శాతం గొర్రెల యూనిట్లను అందించామని, మరో 50 శాతం త్వరలో అందజేస్తామన్నారు. 2,13,000 పాడి పశువులను పంపిణీ చేయగా మరికొన్ని త్వరలో పంపిణీ చేస్తామన్నారు. పశువులకు సంబంధించిన ప్రత్యేక మెటర్నటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మంథనిలో మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక కళాశాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్​తో మాట్లాడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​, జిల్లా జడ్పీ ఛైర్మన్​ పుట్ట మధుకర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఇష్టం వచ్చినట్టు బిల్లులు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు: తలసాని

ABOUT THE AUTHOR

...view details