'ధాన్యం ఆరబెడితే మళ్లీ తడిసింది' - ikp
వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ఆరబోశారు. దీనికి నాలుగు రోజులు పట్టింది. రేపు వాటిని తరలిద్దాం అనుకునే సమయంలో మళ్లీ వర్షం వచ్చి ధాన్యం తడిసింది. అన్నదాతకు మనశ్శాంతి లేకుండా చేసింది.
తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతన్నలు
పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని ఐకేపి కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన వడ్లు తెల్లవారుజామున కురిసిన వడగండ్ల వానకు మళ్లీ తడిసి ముద్దయ్యాయి. నాలుగు రోజుల క్రితం వాన కురిసి ధాన్యం తడిసింది... అవి ఆరబోయడానికే నాలుగు రోజులు పట్టిందని వాపోయారు రైతులు. ఈరోజు వాటిని విక్రయించేవేళ మళ్లీ ఉదయం కురిసిన వర్షానికి చేతికందిన పంట నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
Last Updated : Apr 22, 2019, 5:09 PM IST