పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాడిదల గండి వద్ద రెండు లారీలు వెనుక నుంచి ఢీకొన్నాయి. వెనుక లారీలో ఉన్న డ్రైవరు తలారీ అనిల్ తీవ్రంగా గాయపడ్డారు. మంథని పోలీసులు వెంటనే స్పందించి... సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సింగరేణి రెస్క్యూ టీం సహాయంతో డ్రైవర్ను లారీ క్యాబిన్ నుంచి బయటకు తీశారు. మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రెండు లారీలు ఢీ... డ్రైవర్ను రక్షించిన పోలీసులు - accident in peddapalli
పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాడిదల గండి వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. పోలీసులు సకాలంలో ఘటనాస్థలానికి చేరుకుని డ్రైవర్ను రక్షించి చికిత్స కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పెద్దపల్లిలో రెండు లారీలు ఢీ