పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏసీపీ ఉమేందర్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు, కేంద్ర బలగాల కవాతు నిర్వహించారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన కవాతు గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు సాగింది.
గోదావరిఖనిలో పోలీస్, కేంద్ర బలగాల కవాతు - పోలీసుల కవాతు
ప్రజల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ వెల్లడించారు.
గోదావరిఖనిలో పోలీస్, కేంద్ర బలగాల కవాతు
ప్రజల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడం, శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసు యంత్రాగం పనిచేస్తుందని ఏసీపీ ఉమేందర్ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ప్రజల రక్షణకై అందుబాటులో ఉంటారని వెల్లడించారు. గోదావరిఖని సీఐ పరమేష్ కుమార్ ఈ కవాతులో పాల్గొన్నారు.
ఇవీ చూడండి:బ్యాటరీతో పనిచేసే ట్రాక్టర్ను చూశారా?