పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త ఆమె తలపై రాడ్డుతో మోది హత్య చేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గోదావరిఖనిలో గాంధీనగర్లో నివాసముండే దుర్గం శ్రావణ్ ఎమిమిదేళ్ల క్రితం స్థానిక జీఎం కాలనీకి చెందిన మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులు బాగానే ఉన్నా... ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రేగాయి. మౌనికకు ఇతరులతో సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను దారుణంగా హతమార్చాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తన తల్లికి ఏమైందో తెలియక దిక్కులు చూస్తున్న వీరి పరిస్థితి చూపరులను కంటతడి పెట్టించింది.
తన కూతురిని ప్రతి రోజూ వేధించేవాడని మౌనిక తల్లిదండ్రులు ఆరోపించారు. తాము నచ్చచెబితే మంచిగా ఉంటానని నమ్మించి హత్య చేశాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. మృతురాలి తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త - పెద్దపల్లిలో భార్యను హతమార్చిన భర్త
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం బాగానే ఉన్నా ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. అనుమానంతో కట్టుకున్న భార్యనే దారుణంగా హత్య చేశాడు. హృదయ విదారక ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. తన తల్లికి ఏమైందో తెలియక దిక్కులు చూస్తోన్న ఇద్దరు కుమారుల పరిస్థితి చూపరులను కంటతడి పెట్టించింది.
భార్య హత్య
ఇదీ చూడండి : కంటోన్మెంట్లోని లాజిస్టిక్స్ గోదాంలో అగ్ని ప్రమాదం