తెలంగాణ

telangana

ETV Bharat / state

కోలాట కళాకారులకు ఆత్మీయ సన్మానం

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలోని కోలాట కళాకారులు వండర్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్​లో​ చోటు సాధించినందుకు శిశు సంక్షేమశాఖ ఆర్గనైజర్​ బూర విజయరెడ్డి వారికి ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించారు.

A greeting to Kolata artists in peddapalli district
కోలాట కళాకారులకు ఆత్మీయ సన్మానం

By

Published : Jan 3, 2020, 1:26 PM IST

డిసెంబర్ 29న శ్రీరాంపూర్​లో నిర్వహించిన మహా కోలాట నృత్యోత్సవ పోటీల్లో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్​లో చోటు సాధించిన గోదావరిఖని కోలాట కళాకారుల కృషి అభినందనీయమని తెరాస నాయకురాలు, శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ బూర విజయరెడ్డి పేర్కొన్నారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటుచేసిన కోలాట బృంద కళాకారులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూల విజయరెడ్డి ఆధ్వర్యంలో కోలాట శిక్షకుడు మేడి తిరుపతితో పాటు.. శ్రీ వెంకటేశ్వర కోలాట కళాకారులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

కోలాట కళాకారులకు ఆత్మీయ సన్మానం

ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details