తెలంగాణ

telangana

ETV Bharat / state

రహదారి ప్రమాదాలపై విద్యార్థుల ప్లాష్​మాబ్

ఏటా దేశంలో అధిక శాతం మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లే సంభవిస్తున్నాయనేది ఓ అంచనా. ప్రజల్లో అవగాహనకు అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్​లో రహదారి భద్రతపై విద్యార్థులు ప్లాష్​మాబ్​ నిర్వహించారు.

ప్లాష్​మాబ్​

By

Published : Feb 9, 2019, 4:06 PM IST

Updated : Feb 9, 2019, 4:42 PM IST

రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థుల అవగాహన
30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణపై రవాణా శాఖ ఆధ్వర్యంలో ట్రినిటీ కళాశాల విద్యార్థులు ప్లాష్​మాబ్​ నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డితో పాటు డీసీపీ సుదర్శన్​ గౌడ్​ శాంతి కపోతాలు ఎగురవేశారు. రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులు నిర్వహించిన నృత్యాలు అందరినీ అలరించాయి. ప్రజలందరి భాగస్వామ్యంతోనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.
ప్రజల్లో అవగాహనకు రోడ్డు భద్రతా వారోత్సవాలు ఎంతగానో ఉపకరిస్తాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
Last Updated : Feb 9, 2019, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details