రామగుండం సింగరేణి ఓసీపీ-1లో మంగళవారం జరిగిన ప్రమాదంపై చర్చలు ఫలించాయి. అధికారులు, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం విషయంలో రెండు సార్లు చర్చలు విఫలం కాగా... మూడోసారి స్థానిక ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నేతలు, ఇతర పార్టీల నాయకులు చర్చలకు ముగింపు పలికారు. ఒక్కో కుటుంబానికి 40 లక్షల నష్టపరిహారం, కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం అంగీకరించింది.
40 లక్షల పరిహారం.. కాంట్రాక్టు ఉద్యోగం - సింగరేణి ప్రమాదం
పెద్దపల్లి జిల్లా సింగరేణి ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం విషయంలో చర్చలు సఫలం అయ్యాయి. యాజమాన్యం 40 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది.
సింగరేణి ప్రమాద బాధిత కుటుంబాలకి రూ.40 లక్షల పరిహారం