పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామ సమీపంలో మూడు లారీలు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం జరిగింది. మంథని- కాటారం ప్రధాన రహదారిపై గాడిదల గండి గుట్ట వద్ద ఈ ప్రమాదం జరగ్గా... ఇరువైపులా వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. డ్రైవర్లకు చిన్నచిన్న గాయాలు మినహా... ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవటం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మూడు లారీలు ఢీ... 6 గంటలపాటు ట్రాఫిక్ జామ్ - crime news
ప్రమాదవశాత్తు మూడు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో సుమారు 6 గంటలపాటు రహదారికి ఇరువైపులా వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పెద్ద ప్రమాదమేమి జరగకపోవటం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎగ్లాస్పూరు సమీపంలో జరిగింది.
మూడు లారీలు ఢీ... 6 గంటలపాటు నిలిచిపోయిన ట్రాఫిక్
ఒకవైపు వర్షం మరొక వైపు రహదారి పక్కకు బురద ఏర్పడటం వల్ల వాహనాలు దిగబడి పోతున్నాయి. సుమారు 6 గంటల పాటు నుంచి రోడ్లపై వాహనాలు నిలిచిపోగా.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీలను పక్కక్కు తప్పించి.... ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.