నిజామాబాద్ కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో భూ దస్త్రాల లేఖరులు, రియల్ వ్యాపారులు ఆందోళన చేపట్టారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేసి.. ధరణి ద్వారా కాకుండా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు.
'పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి' - ధరణి వార్తలు
ఎల్ఆర్ఎస్ రద్దు చేసి.. ధరణి ద్వారా కాకుండా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ భూ దస్త్రాల లేఖరులు, రియల్ వ్యాపారులు నిజామాబాద్ కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో ఆందోళన చేపట్టారు. నూతన విధానం వల్ల ఇప్పటికే అనేక మంది రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

'పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి'
కోర్టు ఇచ్చిన తీర్పును కాదని కొత్త పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారని.. అది కూడా ఎల్ఆర్ఎస్ ఉంటేనే చేస్తున్నారని రియల్ వ్యాపారులు ఆరోపించారు. నూతన విధానం వల్ల ఇప్పటికే అనేక మంది రోడ్డున పడ్డారని.. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలన్నారు.
ఇదీ చదవండి:కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ అమలు