తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రకృతి వ్యవసాయాన్ని విశ్వవ్యాప్తం చేయాలి' - Nature farming

భావితరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం కావాలని రైతు బంధువు విజయ రామ్ అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా అలాంటి ఆహారాన్ని అందించవచ్చని తెలిపారు.

Vijaya Ram said  nature farming should be spread all over the world.
'ప్రకృతి వ్యవసాయాన్ని విశ్వవ్యాప్తం చేయాలి'

By

Published : Mar 7, 2021, 10:13 AM IST

విశ్వవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం వ్యాప్తి చెందాలని రైతు బంధువు విజయ రామ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామంలోని ఇందూరు తిరుమల దేవస్థానంలో... ప్రకృతి వ్యవసాయంపై స్థానిక రైతులకు అవగాహన కల్పించారు. వాన నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంపొందించుకోవడం, దేశీయ ఆవు ప్రాముఖ్యత, దేశీయ విత్తనాల విలువలు, సుభాశ్​ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు.

భావితరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం కావాలని విజయ రామ్ అన్నారు. తమ బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి:ప్రబలుతున్న బోదకాలు... కొత్తగా మరో 200 మందికి పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details