నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సపల్లిలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అన్యాయంగా ఓ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు. గ్రామాభివృద్ధి కమిటీ పేరిట 182/2 సర్వే నంబర్లో గల రెండెకరాల భూమిని భూమన్న కబ్జా చేశాడంటూ ఆరోపిస్తున్నారు. వాస్తవంగా భూ ప్రక్షాళనలో భాగంగా... అతనికి తెలియకుండానే రెండెకరాల భూమి భూమన్న పేరిట ఎక్కింది. కావాలనే భూమన్న తన పేరి మీదకు ఎక్కించుకున్నాడంటూ... ఆ భూమిని తిరిగిచ్చేయాలని, అంతేకాకుండా 50 వేల జరిమానా కట్టాలని సూచించారు. నాకు తెలీకుండా ఎక్కిన భూమికి నేనెందుకు జరిమానా కడ్తానని భూమన్న ప్రశ్నించాడు. ఆగ్రహించిన కమిటీ సభ్యులు సదరు కుటుంబాన్ని సాంఘీక బహిష్కరణ చేశారు. ఊళ్లో ఎవరూ అతని కుటుంబంతో మాట్లాడొద్దని చెప్పారు. కనీసం నిత్యావసర సరుకులు కూడా ఇవ్వకుండా చేశారాని బాధితుడు వాపోతున్నాడు, ఎలాగైనా సరే తమ కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు.
అన్యాయంగా గ్రామ బహిష్కరణ - అన్యాయంగా గ్రామ బహిష్కరణ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సపల్లిలో అనాగరికం రాజ్యమేలుతోంది. ఓ కుటుంబాన్ని బహిష్కరణ చేశారు.
అన్యాయంగా గ్రామ బహిష్కరణ