'కష్టాలకు చెక్ పెట్టనున్న భూగర్భ డ్రైనేజ్' - మ్మెల్యే బిగాల గణేష్ గుప్తా
నిజామాబాద్ నగర అభివృద్ధిలో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ కీలక ముందడుగు అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
'కష్టాలకు చెక్ పెట్టనున్న భూగర్భ డ్రైనేజ్'
నిజామాబాద్లో నిర్మించిన భూగర్భ మురుగు నీటి వ్యవస్థను ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. మురుగు ప్రవాహంతో నగర వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రోగాల బారిన పడి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని మంత్రి గుర్తు చేశారు. ఈ కష్టాలకు భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ చెక్ పెడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్ను సైతం ఇక్కడ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.