నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో.. ఆకుల మల్లవ్వ సంతాపసభను నిర్వహించారు. సీపీఐ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మల్లవ్వను అందరు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.
మరణానంతరం నేత్రాలు, శరీర దానంతో.. మల్లవ్వ సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలిచారని కృష్ణ అన్నారు. ఇందూర్ కమ్యూనిస్టు ఉద్యమానికి ఆమె ఇల్లు ఒక అడ్డా అని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో తన కుమారుడిని జైల్లో పెట్టినా.. ధైర్యంగా నిలబడి ఉద్యమానికి అండగా నిలిచారంటూ కొనియాడారు.