నిజామాబాద్ నగరంలోని బంగారు మైసమ్మ కాలనీలో ఇద్దరు మైనర్లు పరస్పరం దాడి చేసుకున్నారు. లోడో గేమ్ ఆడుతుండగా రూ. 80 విషయంలో తొమ్మిది, ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులు వారించడం వల్ల అక్కడి నుంచి రైల్వే మైదానానికి వెళ్లి కర్రలతో దాడి చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఓ బాలుడిని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. డబ్బుల కోసమే ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారని నగర సీఐ సత్యనారాయణ తెలిపారు. దాడి చేసిన బాలుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
రూ. 80 కోసం ఇద్దరు మైనర్లు కొట్లాట - two minor people hit with sticks in nizamabad about the money
లోడో గేమ్ ఆడుతుండగా డబ్బుల విషయంలో గొడవపడి ఇద్దరు మైనర్లు కొట్టుకున్నారు. నిజామాబాద్ నగరం బంగారు మైసమ్మ కాలనీలో గొడవపడ్డారు. గాయలపాలైన ఓ బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రూ. 80 కోసం ఇద్దరు మైనర్లు కొట్లాట