తెలంగాణ

telangana

ETV Bharat / state

విష జ్వరాలతో ఇద్దరు చిన్నారుల మృతి - 40 PERSONS IN TREATMENT

నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంబిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు మరణించగా మరో 40 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణమంటున్నారు వైద్యులు.

విష జ్వరాలతో తీవ్ర ఆందోళనలో గ్రామస్థులు

By

Published : Jun 30, 2019, 5:23 AM IST

Updated : Jun 30, 2019, 7:55 AM IST

పది రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మలేరియా లక్షణాలు కనిపించకపోయినా చిన్నారులు మాత్రం విష జ్వరాలతో మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. జ్వరాలకే మృతి చెందే పరిస్థితి ఉండదు కనుక మరేదైనా కొత్త వైరస్ వ్యాపించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ వ్యవధిలోనే ఇద్దరు పిల్లలు మృతి చెందడం పట్ల వైద్య ఆరోగ్యశాఖాధికారులు అప్రమత్తమయ్యారు. ఇద్దరు బాధితుల నుంచి రక్త నమూనాలను సేకరించి పుణెకు పంపించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో చిన్న పిల్లలు విష జ్వరాలతో వణికిపోవడం వల్ల పిల్లలతో మహిళలు పుట్టింటికి పరుగులు తీస్తున్నారు.

నాలుగేళ్ల సౌమ్యకు విపరీతమైన జ్వరం రావడం వల్ల వారం క్రితం అదే రీతిలో ఈ నెల 10న తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం మరి కొంత మంది పిల్లలు జ్వరంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 15 ఏళ్ల లోపు వయసు గల సుమారు 40 మంది చిన్నారులు విష జ్వరాలతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో స్థానికులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.
విద్యార్థులకు జ్వరం... పాఠశాల వెలవెల
ప్రాథమిక పాఠశాలలో మెుత్తం 29 మంది విద్యార్థులు చదువుతున్నారు. గ్రామంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో తరగతులు వెలవెలబోతున్నాయి. ఇప్పుడు కేవలం ఆరుగురు విద్యార్థులు మాత్రమే హాజరవుతున్నందున పాఠశాల నిర్మానుష్యంగా మారింది. అటు ఉన్నత పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
44 మందికి గానూ ప్రతీ రోజు 15కి మించి విద్యార్థులు తరగతి గదులకు రావట్లేదు. చాలా మంది తమ అమ్మమ్మ ఇంటికి వెళ్లి పోగా మరికొందరు అనారోగ్యంతో మంచం పడుతున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా సంభవించిన మార్పు కారణంగానే జ్వరం, దురద, దద్దుర్లతో చిన్నారులు బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.

వాతావరణంలో వచ్చిన మార్పులే జ్వరాలకు కారణం : వైద్యులు

ఇవీ చూడండి : 8 మంది ఉపాధ్యాయులను సస్పెండ్​ చేసిన కలెక్టర్​

Last Updated : Jun 30, 2019, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details