తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మాక్లూర్ మండలం మనిక్ బండర్ వద్ద ఈ ఘటన జరిగింది. సమీపంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడని తెలిపారు. మృతుడు ధన్‌రాజ్ కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయినాథ్ తెలిపారు.
తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం.. మరో ప్రాణం బలి - tsrtc employees strike effect
నిజామాబాద్ జిల్లా మనిక్ బండర్ వద్ద తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మరో నిండు ప్రాణం బలైంది. సమీపంలోని ఫ్యాక్టరీ వద్ద రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం.. మరో ప్రాణం బలి