నిజామాబాద్ నగరంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజు నిరసనలు వెల్లువెత్తాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులకు మద్దతుగా విద్యార్థి జేఏసీ సంఘాలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా - ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన విద్యార్థి సంఘాలు
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా విద్యార్థి జేఏసీ సంఘాలు నిజామాబాద్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా