తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు చేయండి.. ఆర్మూర్ లో రైతుల ధర్నా

ధాన్యం కొనుగోలు చేయాలంటూ.. ఆర్మూర్ మండలం గగ్గుపల్లి గ్రామ రైతులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. గత 40 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పలుకుబడి ఉన్న రైతుల ధాన్యం కాంటా వేసి.. సన్నకారు రైతుల ధాన్యాన్ని పక్కన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

To buy grain .. Farmers' dharna in Armoor
ఆర్మూర్ లో రైతుల ధర్నా.. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

By

Published : May 21, 2020, 2:02 PM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గగ్గుపల్లి గ్రామ రైతులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో.. గత 40 రోజుల నుంచి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షం వల్ల బస్తాలు తడిసి పోతున్నాయని అన్నదాతలు పేర్కొంటున్నారు.

రాజకీయ పలుకుబడి ఉన్న రైతుల ధాన్యం కాంట వేసి రైస్ మిల్లులకు పంపుతున్నారని.. సన్నకారు రైతుల ధాన్యాన్ని పక్కన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారి హరికృష్ణ, తహసీల్దార్ సంజీవ్ రావులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడం వల్ల ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి:ఒకే కుటుంబంలో 8 మందికి కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details