నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ఇక్కట్లు పడుతున్నారని ఈటీవీ భారత్ కథనాలకు అధికారులు స్పందించారు. విద్యార్థులు ఎక్కువగా ఉండటం వల్ల క్యూలైన్లో నిలబడాల్సి వస్తుందని..నాలుగు లైన్లకు పెంచి విద్యార్థులకు తొందరగా భోజనం అందేలా ఏర్పాట్లు చేశారు. ఎంఈఓ శాంత కుమారి పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
మూడు నుంచి నాలుగు.. ఈటీవీ భారత్ కథనానికి స్పందన - నిజామాబాద్
బోధన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఇక్కట్లపై ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన
Last Updated : Jul 27, 2019, 7:45 PM IST