తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్ర వాహనం ఎత్తుకెళ్లిన దొంగలు.. సీసీ కెమెరాల్లో రికార్డు - crime news

నిజామాబాద్​లోని రోటరీనగర్​లో అర్ధరాత్రి దొంగలు ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. దొంగలను పట్టుకోవాలని కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Thieves theft a two-wheeler in nizamabad
ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు.. సీసీ కెమెరాల్లో రికార్డు

By

Published : Aug 27, 2020, 10:13 PM IST

నిజామాబాద్ నగర శివారులోని రోటరీ నగర్​లో ఇంటి బయట పార్క్​ చేసిన ద్విచక్రవాహనాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ప్రాంతంలో తరచుగా ద్విచక్ర వాహనాలు పోతుండడం వల్ల కాలనీ వాసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు.

దొంగలు వీరే..!

బుధవారం అర్ధరాత్రి బైక్ ఎత్తుకెళ్లే దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఐదో పట్టణ పోలీస్ స్టేషన్​లో కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు పెట్రోలింగ్ పెంచి దొంగలను పట్టుకోవాలని రోటరీ నగర్ వాసులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:రూ.2 లక్షల 57 వేల విలువైన గుట్కాను పట్టుకున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details