నిజామాబాద్ నగరంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడం వల్ల జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలకు సిద్ధమైంది. వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మనుషులు వెళ్లకుండా డ్రోన్‌లతో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లారు.
వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్‌లతో పిచికారి - నిజామాబాద్‌లో డ్రోన్‌లతో పిచికారి
విశ్వాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. నిజామాబాద్‌లోని వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్‌లతో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు.
వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్‌లతో పిచికారి
ఒక్కో డ్రోన్‌లో 5 లీటర్ల చొప్పున ఉదయం, సాయంత్రం వేళల్లో పిచికారి చేశారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్ జోన్లు, ఐసోలేషన్ కేంద్రాలతో పాటు నగరంలోని అన్ని ప్రధాన రహదారుల్లో పిచికారి చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి :తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు