నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి పలు చోట్ల వర్షం కురిసింది. మోపాల్ మండలంలో కురిసిన వర్షానికి ధాన్యం నానిపోయింది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురవడం వల్ల.. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసింది.
అకాల వర్షానికి... కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం - crop
ఆరుగాలం శ్రమించి పండించిన పంట... అకాల వర్షంతో రైతులకు కన్నీరును మిగిల్చింది. నిజామాబాద్ జిల్లాలో కురిసిన ఆకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. దీనితో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అకాల వర్షానికి... కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నెలరోజులకు పైగా సమయం పడుతోంది. దీనితో వర్షం నుంచి ధాన్యం కాపాడుకోవడం రైతులకు తలకు మించిన భారంగా మారింది. వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారు.
Last Updated : May 16, 2020, 3:59 PM IST