నిజామాబాద్ గిరిరాజ్ డిగ్రీ, పీజీ కళాశాలలో కోర్సుల ఎత్తివేతపై పీడీఎస్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జిల్లాలో ఉన్న ఏకైక ప్రభుత్వ కళాశాలలో కోర్సులు తీసేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పీజీ కోర్సులు పునరుద్ధరణ చేయకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
కోర్సుల ఎత్తవేతపై విద్యార్థి సంఘాల ఆందోళన - degree college
గిరిరాజ్ డిగ్రీ, పీజీ కళాశాలలో పీజీ కోర్సుల ఎత్తివేతపై పీడీఎస్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నినాదాలు చేస్తున్న విద్యార్థులు