నిజామాబాద్లో నిర్మాణంలో ఉన్న నూతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని దుబ్బా ప్రాంతంలో సుధాకర్ అనే వ్యక్తి నూతనంగా నిర్మిస్తోన్న బిల్డింగ్ పనులు జరుగుతున్నాయి. మొదటి అంతస్తులో బిల్డింగ్ పైకప్పు వేస్తుండగా అకస్మాత్తుగా రెండు పిల్లర్లు పడిపోవడంతో భవనం మొత్తం నేల మట్టం అయింది. అక్కడే పనిచేస్తున్న ముగ్గురు కూలీలు బిల్డింగ్ కింద పడిపోవడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు.
భవనం కుప్పకూలి ముగ్గురికి తీవ్ర గాయాలు - ముగ్గురికి తీవ్ర గాయాలు
నిర్మాణంలో ఉన్న నూతన భవనం కుప్పకూలి.. ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
భవనం కుప్పకూలి...ముగ్గురికి తీవ్ర గాయాలు